Saturday, January 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైద‌రాబాద్-విజ‌య‌వాడ హైవేపై ర‌ద్దీ.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవే

హైద‌రాబాద్-విజ‌య‌వాడ హైవేపై ర‌ద్దీ.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మూడు రోజుల సంక్రాంతి పండ‌గ ముగియ‌డంతో జ‌నాలు ప‌ట్ట‌ణం బాట‌ప‌ట్టారు. భారీ స్థాయిలో త‌ర‌లివ‌చ్చే వాహ‌నాల‌తో (హైద‌రాబాద్-విజ‌య‌వాడ‌) నేష‌న‌ల్ హైవే-65పై ట్రాఫిక్ పెర‌గ‌నుంది. అదే విధంగా చిట్యాల స‌మీపంలో హైవేపై వంతెన నిర్మాణానికి మ‌ర‌మత్తులు జ‌రుగుతున్నాయి. దీంతో కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోతున్నాయి. ఈనేప‌థ్యంలో ర‌ద్దీ త‌గ్గించ‌డానికి పోలీసులు ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వాహ‌నాదారులు స‌కాలంలో గ‌మ్య చేర‌డానికి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను సూచించారు.

ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు క్రింద సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దారి మళ్లింపు వివరాలు:

1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి – మాల్ మీదుగా హైదరాబాద్.

2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి – చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.

3) నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు :

నల్లగొండ – మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.

4.) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు..
కోదాడ-హుజూర్నగర్-మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.

5). ఎన్. హెచ్ 65 (విజయవాడ -హైదరాబాద్ )రహదారి పై చిట్యాల,పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుండి భువనగిరి గుండా హైద్రాబాద్ మళ్లించడం జరుగును .

ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ-హైద్రాబాద్ (ఎన్‌హెచ్ 65 హైవే)పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -