Saturday, January 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మృతి

కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తూర్పు డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (డిఆర్‌సి)లోని రుబయాలో కోల్టన్‌ గనిలో కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని విపత్తుశాఖ వెల్లడించింది. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలను విపత్తు శాఖ స్పష్టం చేయలేదు. ఈ ఘటన ఉత్తర కివు ప్రావిన్స్‌లోని రుబయా ప్రాంతంలో జరిగినట్లు స్థానిక, అంతర్జాతీయ మీడియా తెలిపింది. శుక్రవారం నాటికి ఉత్తర కివు ప్రాంత అధికారులు మృతుల సంఖ్యను 200గా ధృవీకరించినట్లు ప్రాంతీయ ప్రెస్‌ సర్వీస్‌ ప్రకటించింది. మృతులలో మైనర్లు, చిన్నారులు, వ్యాపారులు ఉన్నట్లు గవర్నర్‌ ప్రతినిధి లుబుంబా కాంబెరే ముయిసా రాయిటర్స్‌ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రమాదంలో రక్షించిన వారిలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన అన్నారు.
కాగా, ప్రపంచ కోల్టాన్‌ ఉత్పత్తిలో రుబయా గనులు దాదాపు 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ ఖనిజాన్ని టాంటలమ్‌ను పొందెందుకు ప్రాసెస్‌ చేస్తారు. దీనిని మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ఏరోస్పేస్‌ భాగాలు, గ్యాస్‌ టర్బైన్‌ల తయారీలో ఉపయోగిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -