Wednesday, March 18, 2026
E-PAPER
HomeNewsనవోదయలో అర్హత సాధించిన విద్యార్థిని అభినందన

నవోదయలో అర్హత సాధించిన విద్యార్థిని అభినందన

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్న
వోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో చైతన్య విద్యనికేతన్ పాఠశాల విద్యార్థిని నాగారం అక్షర అర్హత సాధించిన సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆమెను అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ, గత సంవత్సరం కూడా నవోదయ, పాలిటెక్నిక్, ఐఐఐటి బాసరలో తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రేణు కుమార్, ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -