Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంట్రంప్ తీరును ఖండించిన కాంగ్రెస్

ట్రంప్ తీరును ఖండించిన కాంగ్రెస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అకార‌ణంగా ఇరాన్ దేశంపై అమెరికా దాడులు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో యూఎస్ తీరుపై ప్ర‌ప‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తమువుతున్నాయి. తాజాగా ఇరాన్‌ మూడు అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడిని భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌తో చర్చలు కొనసాగించాలన్న.. యూఎస్ ఇచ్చిన పిలుపును అపహాస్యం చేసిందని కాంగ్రెస్‌ పేర్కొంది. అమెరికా దాడులను మోడీ ప్రభుత్వం ఖండించకపోవడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించింది. ఇరాన్‌తో తక్షణమే దౌత్యపరమైన చర్చలు జరపాలని, ఇప్పటివరకు ప్రదర్శించిన దానికంటే.. ఇంకా ఎక్కువ నైతిక ధైర్యాన్ని ప్రదర్శించాలి అని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జి జైరాం రమేష్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా మోడీ గాజాలో జరుగుతున్న మారణహోమంపైనా.. మాట్లాడకపోవడం.. మౌనం వహించడం తగదని ఎక్స్‌ పోస్టులో జైరాం రమేష్‌ అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad