Sunday, November 9, 2025
E-PAPER
Homeజాతీయంల‌ద్దాఖ్ అల్ల‌ర్లు వెనుక కాంగ్రెస్ కుట్ర: బీజేపీ

ల‌ద్దాఖ్ అల్ల‌ర్లు వెనుక కాంగ్రెస్ కుట్ర: బీజేపీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ల‌ద్దాఖ్ అల్ల‌ర్లు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్న‌ట్లు బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు యువత చేపట్టిన అల్లర్లలో కాంగ్రెస్‌ కౌన్సెలర్‌ పుంట్సోగ్‌ స్టాంజిత్‌ తెపాగ్‌ పాల్గొన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అది జనరల్‌ జెడ్‌ నిరసన కాదని, కాంగ్రెస్‌ నిరసన అని బీజేపీ ఎంపీ సంబిత్‌ పాత్రా అన్నారు.లద్దాఖ్‌ లో జనరేషన్‌ జెడ్‌ (Gen Z) యువత నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో నలుగురు మరణించగా, 90 మందికిపైగా గాయపడ్డారు. ఆందోళనకారులు లద్దాఖ్‌లోని బీజేపీ కార్యాలయం, హిల్‌ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ను తగలబెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -