నవతెలంగాణ-హైదరాబాద్: పీఎం మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ‘ఇదంతా అబద్దం. మోడీకి చెప్పడానికి ఇంకేమీ లేదు. నేను దీనిపై ఈరోజు బీహార్‌లో సమాధానం చెబుతాను. మోడీ చెబుతున్నది అబద్ధం. తుపాకీ గురిపెట్టి ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయమని ఎవరూ చెప్పరు. కాంగ్రెస్ ఎప్పుడూ ఇలా చేయలేదు అని ఆయన సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో అన్నారు. మోడీజీ దేశానికి ప్రధాని. ఆయన ఇలాంటి మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇది అతని స్థాయికి తగినది కాదు. ఆయన స్థాయికి తగినట్టుగా మాట్లాడడం పక్కనపెట్టి.. బీహార్‌లో ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారు అని ఖర్గే ఆరోపించారు. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం బీహార్‌లోని రాజా పాకర్‌లో జరగనున్న ర్యాలీలో ఖర్గే పాల్గొని ప్రసంగించనున్నారు.
అయితే ఆదివారం బీహార్‌లో అర్రాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పీఎం మోడీ సంచలన వ్యాఖ్యలు విషయం తెలిసిందే. ఆర్‌జెడి ఒత్తిడిమేరకే సీఎం అభ్యర్థిగా తేజస్వియాదవ్‌ను మహాగట్బంధన్ ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ నుంచి ఆర్‌జెడి ముఖ్యమంత్రి పదవిని దొంగిలించిందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పై కౌంటర్ ఇచ్చారు.



