Monday, March 23, 2026
E-PAPER
Homeజిల్లాలుగ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత

గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత

- Advertisement -

నవతెలంగాణ-మునిపల్లి: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మాజీ ఎంపీటీసీ పాండు అన్నారు.మండలంలోని పెద్ద గోపులారం గ్రామములో సోమవారం 170 మీటర్ల వ్యవధితో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పాండు గ్రామ సర్పంచ్ మల్లేశంతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కృషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీతో పాటు, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, గ్రామాల్లో సీసీ రోడ్లు,అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ రామయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -