నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి మార్పు అంశం హీటెక్కిస్తుంది. సిద్ధరామయ్య వర్సెస్ డీకే.శివకుమార్ అనే విధంగా పరిణామాలు మారిపోయాయి. తాజా పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తం అయింది. హైకమాండ్ దూతలను కర్ణాటకకు పంపించింది. ప్రస్తుత పరిణామాలను కాంగ్రెస్ దూతలు పరిశీలిస్తున్నారు.
ఇక కర్ణాటక ప్రభుత్వంలో చోటుచేసుకున్న హఠాత్తు పరిణామాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరుకు వచ్చారు. అసంతృప్తి ఎమ్మెల్యేలతో కలిసి వివరాలు సేకరించనున్నారు. ముఖ్యమంత్రి మార్పుపై అభిప్రాయాలు సేకరించి.. అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు
ఇదిలా వుండగా ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే.శివకుమార్‌కు మద్దతుగా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. తక్షణమే డీకే.శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ డిమాండ్ చేశారు. మిగిలిన పదవీ కాలం అయినా డీకే.శివకుమార్‌కు అప్పగించకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు. చాలా మంది డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని ఎదురుచూస్తు్న్నారని.. ఆ పదవి పొందేందుకు అర్హుడు అని తెలిపారు.