- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే గురువారం టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని గాంధీభవన్లో నిర్వహించనుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాలపై చర్చించనున్నారు.
- Advertisement -



