Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీజేపీ విధానాలనే అవలంబిస్తున్న కాంగ్రెస్‌

బీజేపీ విధానాలనే అవలంబిస్తున్న కాంగ్రెస్‌

- Advertisement -

– కర్నాటకలో అభివృద్ధి ముసుగులో పేదల భూములు స్వాధీనం
– సాగుభూములకు పట్టాలివ్వాలి
– ప్రజలు భూపోరాటానికి సిద్ధం కావాలి : భారీ బహిరంగ సభలో బి. వెంకట్‌ పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

బీజేపీ విధానాలనే కాంగ్రెస్‌ అవలంబిస్తోం దని, అభివృద్ధి ముసుగులో పేదల భూములను స్వాధీనం చేసుకుంటోందని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. గురువారం కర్నాటకలోని కొప్పల్‌ జిల్లాలో సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక, రైతు సంఘం, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ బహి రంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బి. వెంకట్‌ మాట్లాడుతూ బీజేపీ విధానాలకు వ్యతిరే కంగా అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కమలం పార్టీ విధానాలనే అవలంబిస్తోందని విమర్శిం చారు. భూ పట్టాలు పక్కనపెట్టి ప్రజలు సాగు చేసుకుంటున్న 10 లక్షల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేం దుకు చర్యలు చేపట్టింద న్నారు. ధనవంతులు, కంపెనీల అధిపతులే రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందారని, అనేక జిల్లాల్లో వేల ఎక రాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని విమర్శిం చారు. అభివద్ధి కోసమే అయితే సాగులేని భూము లను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ధనవంతులు, పలు కంపెనీల వద్ద ఉన్న భూము లు తీసుకుని పేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్న భూము లను పేదలకు పంచి పెడుతోందని తెలిపారు. భూమి పంపిణీ చేయ కుండా పేదల కొనుగోలు శక్తి పెంచడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కొనుగోలు శక్తి పెరగకుండా అభివృద్ధి కూడా సాధ్యం కాదన్నారు. దేశంలో ఆర్ధిక వనరులు, ఉత్పత్తి పేదలకు చెంద డమే కీలక లక్ష్యమన్నారు. ఈ సభలో రైతు సంఘం నాయకులు బస్వరాజ్‌, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు ముని వెంకటయ్య, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad