నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ తలపెట్టిన జనహిత పాదయాత్ర రెండో విడత ఈ నెల 24 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు ఇవాళ పీసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. 24వ తేదీ చొప్పదండి నియోజకవర్గం లో సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 25వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం, ఉదయం 10:30 గంటల నుంచి కరీంనగర్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం ఉంటుంది. 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర, 26వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం, 10.30 గంటలకు వరంగల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం ఉండనుంది. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు టీపీసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.