- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా పేరొందిన శామనూరు శివశంకరప్ప(95) మరణించారు. కర్ణాటకలోని దావణగెరె సౌత్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో మరణించారని వైద్యులు తెలిపారు. 1969లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకరప్ప ఎంపిగానూ పనిచేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతిపై పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు.
- Advertisement -



