Sunday, September 21, 2025
E-PAPER
Homeనల్లగొండకాంగ్రెస్ పార్టీ  సేవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కాంగ్రెస్ పార్టీ  సేవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

- Advertisement -

మున్సిపల్ మాజీ చైర్మన్  బర్రె జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి
దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పై పోరాటం చేసిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కి ఉన్నదని, అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలను సేవాదళ్ ఆధ్వర్యంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ కోరారు. ఆదివారం పట్టణంలోని సీతా నగర్ లో సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం కోసం సమగ్రత కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని తెలిపారు.  ఈ దేశానికి అండగా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుట కోసం రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడంలో సేవాదళ్ ముందుండాలని కోరారు.  సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు మాట్లాడుతూ ప్రతి నెల చివరి ఆదివారం సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు 42 శాతం రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్లో ఆమోదం చేయడము శుభ సూచకమన్నారు.  ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా, పట్టణ అధ్యక్షులు సామల రవీందర్,  డాకూర్ ప్రకాష్.  నాయకులు బత్తిని జితేందర్,  కవిత,  ఉడుత రమేష్, గోప శివ, చేవూరిఅమరేందర్, సిరిగంప ప్రశాంత్, కానుగుంట్ల శశి,  కానుగంటి ప్రేమ్ కుమార్  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -