- Advertisement -
నవతెలంగాణ – సదాశివపేట : సదాశివపేట మండలంలో జరుగుతున్న మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆరూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాయికోటి లావణ్యమధు గురువారం తన ఓటు హక్కును వినియోగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,ఓటు మన ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు. ప్రతి అర్హత కలిగిన ఓటరూ తప్పనిసరిగా తన ఓటు వేయాలి. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుంది,” అని తెలిపారు.గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
- Advertisement -



