- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో నమోదైన మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని కార్పొరేషన్‌పై పట్టు సాధించారు. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికలను రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగారు. దిని ఫలితంగానే నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకున్నాది.
- Advertisement -



