Sunday, July 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం

- Advertisement -

టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉనికి ఉండబోదని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జూబ్లీహిల్స్‌ నుంచి గతంలో పోటీ చేసిన మురళిగౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ సంజరుకుమార్‌గౌడ్‌తో పాటు పలువురు మహేశ్‌కుమార్‌ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బనకచర్ల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో ఉంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రజాపాలన కొనసాగుతున్నదని తెలిపారు. అందుకే ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులైన చాలా మంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -