నవతెలంగాణ-హైదరాబాద్: నవరాత్రి, దుర్గా పూజ, గాంధీ జయంతి వంటి పండుగల కారణంగా భారతదేశంలోని బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో జాతీయ, ప్రాంతీయ పండుగలు మాత్రమే కాకుండా.. ఆదివారం ఉన్నాయి. ప్రాంతీయ వేడుకల కారణంగా భారతదేశంలోని బ్యాంకు సెలవులు.. రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
బ్యాంకు సెలవుల జాబితా
సెప్టెంబర్ 29 : దుర్గా పూజ ఏడవ రోజు మహా సప్తమి సందర్భంగా అగర్తల, కోల్‌కతా, గౌహతిలో బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 30 : దుర్గా పూజ, నవరాత్రి ఎనిమిదవ రోజును పురస్కరించుకుని, మహా అష్టమి/దుర్గా అష్టమి కోసం అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్‌కతా, పాట్నా, రాంచీతో సహా పలు నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
అక్టోబర్ 1 : త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మేఘాలయ, కేరళతో సహా అనేక రాష్ట్రాల్లో దసరా, ఆయుధ పూజ, దుర్గా పూజల కారణంగా బ్యాంకులకు సెలవు.
అక్టోబరు 2 : మహాత్మా గాంధీ జయంతి, దసరా, విజయ దశమి, దుర్గాపూజ కారణంగా భారతదేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 3-4 : దుర్గా పూజ (దసైన్) వేడుకల కారణంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 5 : ఆదివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
బ్యాంకులకు సెలవు అయినప్పటికీ.. బ్యాంకింగ్ సెలవులపై ఎలాంటి ప్రభావం ఉండదు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.