Thursday, June 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపోలెండ్‌ అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ నవ్‌రాకి విజయం

పోలెండ్‌ అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ నవ్‌రాకి విజయం

- Advertisement -

వార్సా: పోలెండ్‌ అధ్యక్ష ఎన్నికల్లో జాతీయవాది ప్రతిపక్ష అభ్యర్ధి కరోల్‌ నవ్‌రాకి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. సోమవారం వెలువడిన ఈ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇయు అనుకూల ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. నవ్‌రాకికి 50.89శాతం ఓట్లు వచ్చాయని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ అనుసరిసaూ్త వచ్చిన ఉదారవాద విధాన ఎజెండాను అడ్డుకోవడానికి అధ్యక్షుడికి వుండే వీటో అధికారాన్ని నవ్‌రాకి ఉపయోగించే అవకాశం వుందని భావిస్తున్నారు. ఆదివారం ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడైన వెంటనే తానే విజయం సాధించినట్లు టస్క్‌ పాలక పార్టీ సివిల్‌ కొయిలేషన్‌ అభ్యర్ధి, నవ్‌రాకి ప్రత్యర్ధి రఫల్‌ ట్రజ్‌స్కోవిస్కీ ప్రకటించేసుకున్నారు. కానీ అతి స్వల్ప మెజారిటీతో నవ్‌రాకి విజయం సాధించడంతో అదే విషయాన్ని ఎక్స్‌ వేదికగా రఫల్‌ పంచుకున్నారు. పోలెండ్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఆ ప్రాంత దేశాల అధినేతలు స్పందించారు. రొమేనియా, హంగరీ, చెక్‌ రిపబ్లిక్‌ నేతలు నవ్‌రాకిని అభినందించారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తానని నవ్‌రాకి ఈ సందర్భంగా దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -