Thursday, September 25, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కానిస్టేబుల్ నుండి అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్

కానిస్టేబుల్ నుండి అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్

- Advertisement -

నాలుగు కొలువులు సాధించిన శశిధర్ రెడ్డి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువకుడు సరసన్ శశిధర్ రెడ్డి చిన్ననాటి నుండి కష్టపడి చదివి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తూ వస్తున్నాడు. తాజాగా గ్రూప్ 1 ఫలితాల్లో తన ప్రతిభ కనబర్చి మరొక కొలువు కొట్టేసాడు. మొత్తం నాలుగు కొలువులు సాధించి ఔరా అనిపిస్తున్నాడు. స్వగ్రామమైన భోరజ్ మండలం పిప్పర్ వాడకు చెందిన సరసన్ రాజీవ్ రెడ్డి, లక్ష్మీ దంపతులు కుమారుడు శశిధర్ రెడ్డి చిన్నప్పటి నుండి ఎలాగైనా ఉద్యోగం సాధించాలానే తపనతో పట్టుపట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించాడు. 2016 సంవత్సరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు.

కానీ విధుల్లో చేరలేదు. 2017 సంవత్సరంలో ఫైర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించి విధుల్లో చేరాడు. మళ్ళీ 2024 సంవత్సరంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగం సాధించాడు. కానీ వెళ్ళలేదు. 2017లో సాధించిన ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తూనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. 8 సంవత్సరాలగా విధులు నిర్వహిస్తునే తాజగా విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం సాధించి మల్టీ జోన్ వన్ కు ఎంపికయ్యాడు. దింతో ఆయన ఆనందానికి హద్దులేవు. ఉద్యోగం సాధించడంలో తల్లిదండ్రులు, భార్య సహకారం, అక్క బద్దం స్వాతి ప్రోత్సాహం ఎంతగానో లభించిందని శశిధర్ పేర్కొన్నారు. ఉద్యోగం సాదించడం పట్ల కుటుంబీకులు, బంధుమిత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -