Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్సంపన్నులకే చెందుతున్న రాజ్యాంగ ఫలాలు

సంపన్నులకే చెందుతున్న రాజ్యాంగ ఫలాలు

- Advertisement -

-దేశ సమైక్యత కోసం లౌకిక శక్తులు ఐక్యం కావాలి
– సీతారాం ఏచూరి స్మారక సెమినార్ లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ .స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
: 75ఏండ్ల రాజ్యాంగ ఫలాలు సంపన్నులకే చెందుతున్నాయని సామాన్యులకు దక్కడం లేదని,  రాజ్యాంగ ద్రోహులు దేశంలో రాజ్యమేలుతున్నారని ,దేశ సమైక్యత కోసం లౌకిక శక్తులు ఐక్యం కావాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు  టీ స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు..
సోమవారం సిరిసిల్ల చేనేత వస్త్ర సంఘంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ మాజీ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా స్మారక సెమినార్ నిర్వహించారు. రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ అధ్యక్షతన సెమినార్ జరిగింది తొలుత సీతారాం ఏచూరి చిత్రపటానికి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సీపీఐ సీపీఎం అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి సీతారాం ఏచూరీలకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రదాన వక్తగా హాజరైన సీపీఎం రాష్ట్ర  కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ దేశంలో 200 మంది కోటీశ్వరుల ఆస్తులు దేశంలో 40 శాతం మంది ప్రజల ఆస్తితో సమానంగా ఉందని, ఒక శాతం మంది  చేతుల్లో 50 శాతం ఆస్తి పోగు పడిందన్నారు ఆదాని ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడుగా ఎదిగాడని, కానీ దేశంలో దారిద్య్రరేఖకు దిగువన 42 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు
80 కోట్ల మంది ప్రజలు రేషన్ బియ్యం కోసం ఎదురుచూస్తున్నారంటే దేశంలో పేదరికం ఎలా పెరిగిందో విధితమవుతుందన్నారు   బిజెపి 11 ఏళ్ల  పాలన సామాజిక ఆర్థిక అంతరాలను మరింతగా పెంచిందన్నారు. ఆదానికి ఆకాశం ఎత్తు ఆస్తులు కూడబెడితే అత్యంత నిరుపేదలకు దరిద్రాన్ని కూడబెట్టిందన్నారు కార్పొరేట్ పెట్టుబడిదారులకు లక్షల కోట్లరూపాయల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం, పేదలపై భారాలు మోపుతుందన్నారు హిందూ ముస్లిం క్రైస్తవం ఏ మతం ప్రమాదంలో లేదన్నారు. ఆ మతాల ముసుగులో రాజకీయాలు చేస్తున్న మతోన్మాదుల వల్లే సామాన్య ప్రజలు  ప్రమాదంలో ఉన్నారని చెప్పారు  రాజ్యాంగ హక్కులు కాలరాయటంతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు.
రాజ్యాంగం ఏర్పడిన  నాటి నుండి  రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాల్లే నేడు కేంద్రంలో రాజ్యమేలుతున్నారని విమర్శించారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా మనుషుల మధ్య విభజన తీసుకువచ్చి అట్టడుగు పేదల హక్కులు కాలరాస్తుందన్నారు
మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం మొన్న మాట నీటి మూటగా మారిందన్నారు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొచ్చిందన్నారు రైతుల పంటల కనీస మద్దతుధర  ఇవ్వట్లేదన్నారు మోడీ సర్కార్ హయాంలో దళితులపై దాడులు దౌర్జన్యాలు 300 రేట్లు పెరిగాయన్నారు గత ఐదేళ్ల కాలంలో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అందించిన వివరాల ప్రకారంగత ఐదేళ్లలో  6,34  066 ఫిర్యాదులు నమోదు కాగా బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే అత్యధికంగా జరుగుతున్నాయని చెప్పారు 
బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతుందన్నారు ప్రజాస్వామ్య విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును బీహార్ రాష్ట్రంలో 65 లక్షల మందిని ఓటును అనర్హులుగా చేసిన ఘనత బిజెపిదేనని చెప్పారు సుప్రీంకోర్టు జోక్యంతో ఆధార్ కార్డు ఆధారంగా ఓటు హక్కు నమోదు చేయబడుతుందన్నారు బీజేపీ పాలనలో ఉన్న  మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు చేశారని వారే  బజార్లలో భారత్ మాతాకీ జై అంటున్నారని విమర్శించారు.
దేశంలో మహిళలకు భద్రత కలిగి ఉన్న రాష్ట్రాలలో భారతదేశం 135 స్థానంలో ఉందని చెప్పారు.
వ్యవసాయ కార్మికుల ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి పని దినాలు కల్పించడం లేదన్నారు. సామాజిక న్యాయం ప్రజాస్వామ్యం సెక్యులరిజం ఫెడరల్ వ్యవస్థలను  దెబ్బతింటున్నాయని చెప్పారు నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చబడలేదని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నీటి మూటగా మారిందన్నారు రాజ్యాంగ హక్కులను రక్షించుకోవడం ద్వారా భారత దేశ ప్రజలందరి గుండెకాయ లాగా ఉన్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధన కోసం జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు
ఈ సెమినార్ లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లారపు అరుణ్ కుమార్, ఎరవెళ్లి నాగరాజు గన్నెరం  నర్సయ్య సూరం పద్మ అన్నల్దాస్ గణేష్ గురజాల శ్రీధర్, శ్రీరాముల రమేష్ చంద్ర, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్ , సిరిమల్లె సత్యం.వివిధ ప్రజాసంఘాల నాయకులు మార్వాడీ సుదర్శన్, గాంతుల మహేష్, జె మనోజ్ కుమార్ రూప. కూచన  శంకర్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad