నవతెలంగాణ – రామాయంపేట
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి అన్నారు. గురువారం రామాయంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తాసిల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, ఎంపీడీవో షాజులుద్దీన్ తో పాటు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రి సరఫరాదారులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. సిమెంట్, స్టీల్, ఇసుక వ్యాపారస్తులు ఇందులో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇసుక, స్టీల్‌ను తక్కువ ధరలకు సరఫరా చేయాలని అధికారులు వారిని కోరారు. ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి:తహసిల్దార్ రజనీకుమారి
- Advertisement -
- Advertisement -



