Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్సి.సి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం 

సి.సి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రతిపాదనలతో ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. గ్రాంట్ ద్వారా భీంగల్ మండలంలోని సుదర్శన్ నగర్ తండా గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణం కోసం రూ.5 ( ఐదు లక్షలు) మంజూరయ్యాయి. రోడ్డు పనులు ప్రారంభించేందుకు ఈరోజు పూజ చేసి ప్రారంభిచడం జరిగింది. ఇట్టి సి.సి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మండల ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,పట్టణ అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోదిరే స్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన నాయకులు వాకా మహేష్, భీంగల్ మండల ఉపాధ్యక్షులు భుక్య సురేష్, మాజీ సర్పంచ్ పరమేష్, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -