Saturday, October 25, 2025
E-PAPER
Homeజాతీయం కారును ఢీకొట్టిన కంటైనర్‌..మంత్రికి తప్పిన ప్రమాదం

 కారును ఢీకొట్టిన కంటైనర్‌..మంత్రికి తప్పిన ప్రమాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తరప్రదేశ్‌ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి బేబి రాణి మౌర్యకు పెను ప్రమాదం తప్పింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్‌ ఢీకొట్టింది. అయితే కారు డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి గాయాలు లేకుండా ఆమె క్షేమంగా బయటపడ్డారు. హత్రాస్‌ జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. గశుక్రవారం రాత్రి లక్నోకు పయణమయ్యారు. ఈ క్రమంలో ఫిరోజాబాద్‌ జిల్లాలో జాతీయ రహదారిపై నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో రెండు వైపులా వాహనాలను ఒకే మార్గం గుండా దారిమళ్లించారు. దీంతో ఆమె కారు ముందు వెళ్తున్న కంటైనర్‌ టైర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. వాహనంపై డ్రైవర్‌ పట్టు కోల్పోవడంతో అది అదుపుతప్పి మంత్రి కారుపైకి దూసుకొచ్చింది.

అప్రమత్తమైన డ్రైవర్‌ కారు పక్కకు తీసుకెళ్లాడు. దీంతో కారు కుడివైపు స్వల్పంగా ధ్వంసమైంది. మంత్రికి ఎలాంటి ముప్పు వాటిళ్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌ప్రెస్‌ వేపై వాహనాలు ప్రమాదాల బారినపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ను పోలీసులు సీజ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -