Wednesday, November 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైవేపై బోల్తాపడ్డ కంటెయినర్ లారీ..ట్రాఫిక్ జామ్

హైవేపై బోల్తాపడ్డ కంటెయినర్ లారీ..ట్రాఫిక్ జామ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విశాఖపట్నంలో ఓ కంటెయినర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. నడిరోడ్డుపై కంటెయినర్ పడడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. షీలానగర్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైవేపై కంటెయినర్ బోల్తాపడడంతో షీలానగర్ నుంచి విమానాశ్రయం వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది వాహనాలు నిలిచిపోయాయి.

పోర్టు రోడ్డు నుంచి ఎన్ఏడీ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ షీలానగర్ కూడలి వద్ద అదుపుతప్పి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ సిబ్బంది నాలుగు క్రేన్‌ల సహాయంతో కంటైనర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -