– ఆకునూరి మురళికి టీజీజేఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల సంఘం (టీజీజేఎల్‌ఏ-475) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాకమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళిని గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. వచ్చేనెల రెండు నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను ప్రతినెలా ఇవ్వాలని సూచించారు. ఇంటర్ విద్యను పర్యవేక్షించే డీఐఈవోల పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలని తెలిపారు. కొత్తగా నెలకొల్పిన 25 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులకు కామన్ యూనిఫారమ్ పంపిణీ చేయాలని తెలిపారు. విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ సభ్యులు పీఎల్ విశ్వేశ్వరరావు, జ్యోత్స్న శివారెడ్డి, ఉన్నత విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ అందె సత్యం, టీజీజేఎల్‌ఏ-475 మహిళా కార్యదర్శి సంగీత, నాయకులు విశాలాక్ష్మి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత విద్యలో తెలుగు భాషకు ప్రాముఖ్యతను పెంచడానికి సహకరించాలని విద్యాకమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళిని గురువారం హైదరాబాద్‌లో కలిసి టీజీజేఎల్‌ఏ-475 ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, ఉన్నత విద్య తెలుగు భాషా పరిరక్షణ మిటీ కన్వీనర్ అమ్మిన శ్రీనివాసరావు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యలో తెలుగు భాషా పరిరక్షణ కమిటీ సభ్యులు గోవర్ధన్, సునీల్, ప్రేమ్‌సాగర్, నగేశ్, గిన్నె రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధికి సహకరించండి
- Advertisement -
RELATED ARTICLES