• బొడ్రాయి ఏర్పాటు కు తలెత్తిన వివాదం
• వివాద పరిష్కారానికి కృషి చేసిన ఎంపీడీవో
నవతెలంగాణ -పెద్దవంగర
గ్రామ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక తోడ్పాటునందిస్తామని ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్ అన్నారు. చిట్యాల గ్రామంలో బొడ్రాయి ఏర్పాటు స్థలం విషయంలో ఇటీవల వివాదం తలెత్తింది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో బుధవారం ఎంపీడీవో గ్రామాన్ని సందర్శించి, సర్పంచ్ ఈదురు బుచ్చమ్మ యాకయ్య తో కలిసి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఇరు వర్గాల అభిప్రాయాలను తెలుసుకొని, సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా గ్రామాల్లో ఇలాంటి వివాదాలు చోటు చేసుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్యాలను పాటించాలని సూచించారు. సాంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, అందరికి ఆమోదయోగ్యమైన స్థలంలో బొడ్రాయి పునః ప్రతిష్ట చేయాలన్నారు. దానికి సంబంధించి పలు శాఖల అధికారుల నుంచి అనుమతులు తీసుకుని బొడ్రాయి పునః ప్రతిష్ట చేపట్టాలని గ్రామస్తులకు సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ దాసరి మహాలక్ష్మి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుమలత, వార్డు సభ్యులు శ్రీధర్, వెంకన్న, శారద, రేణుక, మాజీ ఎంపీటీసీ ఎండీ రహీం, బొడ్రాయి పునః ప్రతిష్ట కమిటీ సలహాదారు లక్ష్మినారాయణ, పాక శ్రీనివాస్, యాకయ్య, తన్నీరు మధు, తన్నీరు వేణు, వెంకటేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.



