Thursday, July 3, 2025
E-PAPER
Homeజాతీయంమధురైలో వివాదాస్ప‌ద‌ ప్రసంగం..అన్నామ‌లైపై కేసు ఫైల్

మధురైలో వివాదాస్ప‌ద‌ ప్రసంగం..అన్నామ‌లైపై కేసు ఫైల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై, హిందూ మున్నాని గ్రూపుకు చెందిన ఇద్దరు సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. మధురైలో ఇటీవల మురుగన్ భక్తుల సమావేశంలో హేట్ స్పీచ్ కు సంబంధించి జూన్ 22న జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో అనేక మంది నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని దీనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు వంజినాథన్ అనే న్యాయవాది పేర్కొన్నారు.

వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్నిపెంచేలా, మతపరమైన భావాలను రెచ్చగొట్టడం వల్ల అన్నామలై, హిందూ మున్నాని రాష్ట్ర నాయకుడు కాదేశ్వర సుబ్రమణ్యం, మున్నాని కార్యకర్త సెల్వకుమార్‌పై కేసు నమోదైంది. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ , ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరైన ఈ కార్యక్రమంలో వివిధ వ్యక్తుల ప్రసంగాలు, తీర్మానాలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నానగర్ పోలీసులు బిఎన్‌ఎస్‌ఎస్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మద్రాస్ హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -