Sunday, April 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రేపటి నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం.

రేపటి నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం.

- Advertisement -

నవతెలంగాణ కుభీర్ : మండల కేంద్రమైన కుబీర్ లో ని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10గంటలకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించనున్నట్లు  వ్యవసాయ సహకార సంఘం  కార్యదర్శి క్రాంతి కుమార్  మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న మొక్కజొన్న రైతులు పండించిన పంటలను  ప్రభుత్వం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ప్రభుత్వం 2400  మొదట కల్పిస్తుందని సూచించారు. దీంతో రైతులకు ముందుగా అధికారులు అందించిన టోకెన్ల ప్రకారం తీసుకోని  పంటలను మార్కెట్ తీసుకువచ్చి సహకరించాలని తెలిపారు. అదే విదంగా రైతులు పట్టా పాస్ బుక్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలను తమ వెంట తీసుకురావాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -