నవతెలంగాణ-రాయికల్
రాయికల్ మండలంలో మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏలేటి జలంధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం మార్కెట్‌లో మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,400గా ఉన్నప్పటికీ,కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ.1,700 నుండి రూ.1,800 మధ్యలో అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో ప్రతి క్వింటాల్‌పై సుమారు రూ.600 వరకు రైతులు నష్టపోతున్నారని తెలిపారు.రైతులు కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడం బాధాకరమని,దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. ఆలస్యం చేస్తే రైతులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించా.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
- Advertisement -
- Advertisement -



