Monday, November 3, 2025
E-PAPER
Homeకరీంనగర్పత్తి కొనుగోళ్లకు శ్రీకారం

పత్తి కొనుగోళ్లకు శ్రీకారం

- Advertisement -

నవతెలంగాణ-వేములవాడ
వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి, అర్బన్ మండలంలోని సంకేపల్లి, కొనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామాల్లో సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఈ కేంద్రాలను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గారిమ అగ్రవాల్‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన పత్తిని సీసీఐ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతి క్వింటాల్ పత్తికి 8,110 మద్దతు ధరను కల్పించింది” అని తెలిపారు.విప్ పేర్కొన్న దాని ప్రకారం, వేములవాడ నియోజకవర్గ పరిధిలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు సౌకర్యం కలుగుతుంది, మన ప్రాంతంలో నల్లారే గడి భూములు ఉన్నందున పత్తి పంట సాగు ఎక్కువగా జరుగుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మన జిల్లాలోని రైతులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా వ్యవసాయ మంత్రితో చర్చించి ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించాం,కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచింది అని చెప్పారు. గతంలో ఉచిత విద్యుత్, మద్దతు ధరలను అందించాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతులకు రుణమాఫీతో పాటు సన్నవడ్లకు 500 బోనస్ కూడా ఇస్తోంది అని ఆయన గుర్తు చేశారు.అంతేకాక, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందజేస్తున్నామని, రాజన్న ఆలయ అభివృద్ధికి కృషి కొనసాగుతున్నదని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతులు సీసీఐ సెంటర్లను వినియోగించుకొని ప్రభుత్వ మద్దతును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్డీవో రాధాబాయి,ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజు, డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -