Saturday, October 4, 2025
E-PAPER
Homeజిల్లాలుఈనెల 21న ప‌త్తి కొనుగోళ్లు ప్రారంభం: రైతు కమిషన్ చైర్మన్

ఈనెల 21న ప‌త్తి కొనుగోళ్లు ప్రారంభం: రైతు కమిషన్ చైర్మన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈ నెల 21 నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు. ఇవాళ సీసీఐ అధికారులతో ఫోన్ లో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. పత్తిపంట అమ్మకంలో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని అన్నారు. గతేడాది పత్తి కొనుగోలులో జరిగిన లోపాల గురించి సీసీఐ అధికారులకు వివరించిన కోదండరెడ్డి..సీసీఐ కొనుగోళ్లలో దళారులు ప్రవేశించకుండా చూడాలని కోరారు. రైతులెవరూ తొందరపడి తమ పత్తి పంటను అమ్ముకోవద్దని ఈ నెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపడుతుందని తెలిపారు.

కాగా సీసీఐ నిబంధన ప్రకారం 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉండే పత్తిని కొనుగోళ్లకు అనుమతివ్వరు. అయితే ఇది గతంలో 16 శాతం వరకు అనుమతి ఉండేది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -