Thursday, December 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపోచంపల్లి ఇక్కత్ చీరల నకిలీ నివారించాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 

పోచంపల్లి ఇక్కత్ చీరల నకిలీ నివారించాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 

- Advertisement -

– కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ దృష్టికి 
నవతెలంగాణ ఆలేరు  : పోచంపల్లి ఇక్కత్ పట్టుచీరలు సూరత్ సోలాపూర్ వివిధ ప్రాంతాల్లో నకిలివి తయారవుతుండడంతో చేనేత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50వేల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంది అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మంగళవారం నాడు కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ అధ్యక్షతన హ్యాండ్లూమ్ సెక్టార్ సమస్యలపై కన్సల్టివ్ కమిటీ తో జరిగిన సమావేశంలో పాల్గొని చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ దృష్టికి తీసుకు వచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వం సిల్కు దారం పై 40 శాతం సబ్సిడీ ఇవ్వాలని జిఎస్టి రద్దు చేయాలని చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెటింగ్ చేయాలని కోరినట్లు చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం 100 మంది పార్లమెంట్ సభ్యులు జీఎస్టీని రద్దు చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తింపు చేశా అన్నారు.

22 రకాల చేతివృత్తుల ద్వారా తయారయ్యే వస్తువులను యాంత్రికరణ జరపకూడదని నిబంధన ఉందని దాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 50 వేల కుటుంబాలు చేనేత పరిశ్రమ నమ్ముకొని జీవిస్తున్నారని తెలిపాను అన్నారు.పోచంపల్లి పట్టుచీరలు నారాయణపేట వంటి పట్టుచీరలు జాతీయ అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయని వివరించాను. చేనేత రంగం పై ఆధారపడి దారిద్ర రేఖకు దిగువ ఉన్న చేనేత కార్మికులు ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పిస్తున ఈ రంగం పవర్ లూమ్స్ పై పోచంపల్లి ఇక్కత్ నకిలీ చీరలు తయారు చేస్తుండడంతో డూప్లికేట్ చీరేదో నకిలీ చీరే ఏదో ప్రజలు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్రజలు కూడా మోసపోవాల్సి వస్తుందన్నారు.

పోచంపల్లి పట్టుచీరలు నాణ్యమైన పట్టు దారంతో చేతి ద్వారా నేతన్నలు చీరలు తయారుచేస్తారు. పవర్ లుమ్స్ ద్వారా నకిలీ చీరలు తయారీ మార్కెట్లకు విచ్చలవిడిగా తక్కువ ధరకు విక్రయించడంతో చేనేత కార్మికుల జీవనం దుర్భరంగా మారిందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 30 వేల చేనేత మగ్గాల ద్వారా మహిళలు పురుషులు 50వేల కుటుంబాల వరకు ఆధారపడి జీవిస్తున్నారు. గత 20 ఏళ్లుగా పోచంపల్లి ఇక్కత్ చీరలకు డూప్లికేట్ సమస్య తీవ్రంగా వేధిస్తుందని పరిస్థితి ఇలాగే ఉంటే మరో ఐదేళ్లలోనే ఈ వృత్తి నమ్ముకున్న ఎంతో నైపుణ్యం ఉన్న కార్మికులు వీధిన పడడంతో పాటు రాబోయే తరానికి భారతీయ విలువైన సాంప్రదాయ చేనేత వృత్తి నైపుణ్యం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం తక్షణం చేనేత రంగాన్ని రక్షించడం కోసం 100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు కోరానన్నారు.

చేనేత చీరలకు ప్రభుత్వ గుర్తింపు ట్యాగ్ ఇచ్చి దేశవ్యాప్తంగా టీవీ సోషల్ మీడియాలో హోర్డింగ్ల ద్వారా బ్రాండ్ అంబాసిడర్ ద్వారా ప్రచారం కల్పించాలని చెప్పారు.నకిలీ చీరలు తయారు చేస్తున్న తయారీదారుల ను గుర్తించి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని డూప్లికేట్ చీరను అరికట్టేందుకు పటిష్టమైన నిఘ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మరియు కమిటీ వివరించినట్లు తెలిపారు.కమిటీ సమావేశంలో వీరితోపాటు టెక్స్టైల్ శాఖ రాష్ట్ర మంత్రి పవిత్ర మార్గరేటా టెక్స్టైల్ కార్యదర్శి నీలిమ శర్మ రావు హ్యాండ్లూమ్స్ డిసి డాక్టర్ ఎం వీణ పాల్గొన్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -