Friday, November 14, 2025
E-PAPER
Homeజాతీయంకొన‌సాగుతున్న బైపోల్ ఎన్నిక‌ల కౌంటింగ్

కొన‌సాగుతున్న బైపోల్ ఎన్నిక‌ల కౌంటింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లోని నగ్రోటా నియోజనకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. అలాగే ఒడిశాలోని నౌపాడా స్థానంలో కూడా బిజెపినే లీడ్‌లో ఉంది. రాజస్థాన్‌లో ఆంటా స్థానంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. తెలంగాణ జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్‌నే కైవసం చేసుకోనుంది. తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ ఆంటా స్థానంలో కాంగ్రెస్‌నే లీడ్‌లోకి వచ్చింది.

బీహార్‌ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా నేడు వెల్లడికానున్నాయి. తెలంగాణ (జూబ్లీహిల్స్‌), జమ్మూకాశ్మీర్‌ (బడ్గామ్‌, నాగ్రోటా), రాజస్థాన్‌ (ఆంటా), జార్ఖండ్‌ (ఘాట్టిలా), పంజాబ్‌ (తర్న్‌ తారన్‌), మిజోరాం (డంపా), ఒరిస్సా (నౌపాడా)లో నవంబర్‌ 11న ఓటింగ్‌ జరిగింది.

మిజోరాం (డంపా)లో ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఇక్కడ ఐదు రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. మొదటి రౌండ్‌ పోస్టల్‌ బ్యాలెట్స్‌ని లెక్కిస్తారని, ఆ తర్వాత ఇవిఎంలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి లాల్నున్‌ ఫెలా చాంగ్తు తెలిపారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఇక్కడ 83.07 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఒడిశా నౌపాడాలో ఈరోజు ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఇక్కడ 26 రౌండ్లలో కౌటింగ్‌ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో నవంబర్‌ 11 పోలింగ్‌ 83.45 శాతం నమోదైంది.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -