- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. రామాలయం సమీపంలోని ప్రయివేటు లాడ్జిలో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లాడ్జి సిబ్బంది వారిని వెంటనే భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి యువకుడు మృతిచెందాడు. యువతీ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మృతుడు వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన నడిపింటి రవి(35)గా గుర్తించారు. చికిత్స పొందుతున్న యువతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కి చెందిన మైనర్ బాలికగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు భద్రాచలం పట్టణ పోలీసులు తెలిపారు.
- Advertisement -