- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
వర్షాకాలంలో, చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతున్నదన్న ముందు జాగ్రత్తలో భాగంగా బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాదులోని 362 మంది హోంగార్డ్స్ కు రేయిన్ కోర్ట్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. వర్షాకాలంలో, చలికాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ రేయిన్ కోర్ట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణలో కూడా క్యారీ చేసి అవసరనిమిత్తం ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీ.సీ.పీ(ఏ.ఆర్) రామచంద్ర రావు , హోంగార్డ్స్ విభాగం రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్, హోమ్ గార్డ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -