- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా వారి వెంట ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, గడ్కరీ హాజరయ్యారు.
ఇక ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి, సుప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమయ్యాయి.
- Advertisement -