Thursday, September 11, 2025
E-PAPER
Homeజాతీయంమహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణ‌న్‌ రాజీనామా

మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణ‌న్‌ రాజీనామా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇటీవలే జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణ‌న్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆయ‌న రాజీనామా చేశారు. గుజరాత్‌ గవర్నర్‌ మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ అధికారికంగా ప్రకటించింది.

భారత 15వ ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు 452 ఓట్లు రాగా, విపక్షానికి చెందిన ఆయన ప్రత్యర్థి జస్టిస్‌ బీ సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. 152 ఓట్ల తేడాతో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌ విజయం సాధించారు. ఈ నేపథ్యల శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -