Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డిలో ఈనెల 15న సీపీఐ శతాబ్ది ముగింపు సభ

కామారెడ్డిలో ఈనెల 15న సీపీఐ శతాబ్ది ముగింపు సభ

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ   జిల్లా కార్యదర్శి. ఎల్ దశరథ్ మాట్లాడుతూ  భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు ముగింపు ఉత్సవాలు ఈనెల 15వ తేదీ నా ఉదయం 11 గంటలకు బాసర నుండి ప్రారంభమై.. నిజాంబాద్ మీదుగా కామారెడ్డి కేంద్రానికి 15వ తేదీ 5 గంటల 30 నిమిషములకు కొత్త బస్టాండ్ వద్ద బహిరంగ సభ ఉంటుందని ఆయన అన్నారు. భారతదేశం గడ్డపైన సిపిఐ వందేళ్లు ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ పశ్య పద్మ,  కామ్రేడ్ ఎస్ డి. వలివుల్లా ఖాద్రి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, కామ్రేడ్ నరేంద్ర ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోశాధికారి, కళాబృందం ద్వారా ఆటపాటలు ఉంటాయన్నారు.

  సిపిఐ గ్రామ, మండల, జిల్లా స్థాయి కార్యకర్తలు పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పాల్గొనాలని,  డిసెంబర్ లో 25న ఖమ్మంలో లక్షలాదిమందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 40 దేశాల కమ్యూనిస్టు ప్రతినిధులు హాజరవుతారని 15వ తేదీన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -