- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపల్ నామినేషన్ లు స్వీకరణ ప్రక్రియ ముగియడంతో పార్టీలు ప్రచారం పై దృష్టి సారించాయి. సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా నాయకులు చిరంజీవి నేతృత్వంలో శుక్రవారం 22 వ వార్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ(ఎం) కౌన్సిలర్ అభ్యర్ధిని తగరం నిర్మల ఓటర్లు ను పెరు పేరునా పలకరిస్తూ ఓట్లు అభ్యర్ధించారు. ప్రతీ వీధిలోనూ మౌళిక సదుపాయాలు కల్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



