నవతెలంగాణ – అచ్చంపేట : జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థినిలను ప్రభుత్వ ఆస్పత్రిలో సీపీఐ(ఎం) బృందం పరామర్శించింది. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్, లు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్ కు కారణాలు తెలుసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కందికొండ గీత, జిల్లా కమిటీ సభ్యులు పొదిలి రామయ్య, గుంపల్లి అశోక్, తారా సింగ్ జిల్లా నాయకులు నాగపూర్ మధు కురుమయ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
CPI(M): అస్వస్థతకు గురైన విద్యార్థినిలను పరామర్శించిన సీపీఐ(ఎం) బృందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES