Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరోడ్ల మరమ్మతుల కోసం సీపీఐ(ఎం) పోరుబాట

రోడ్ల మరమ్మతుల కోసం సీపీఐ(ఎం) పోరుబాట

- Advertisement -

నూతనకల్‌ మండల కేంద్రానికి పాదయాత్ర.. రాస్తారోకో
నిధులు కేటాయించాలని మల్లు లక్ష్మి డిమాండ్‌
నవతెలంగాణ-నూతనకల్‌

ఎంపీ, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వీడి పాడైపోయిన రోడ్లను మరమ్మతులకు నిధులు విడుదల చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరుబాట పాదయాత్ర చేపట్టారు. సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల నుంచి గురువారం నూతనకల్‌ మండల కేంద్రానికి పాదయాత్ర చేపట్టారు. అనంతరం పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë మాట్లాడుతూ.. మండల కేంద్రం నుంచి వెంకేపల్లి వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయమైందని, వెంటనే పున:నిర్మించాలని డిమాండ్‌ చేశారు. పదేండ్ల నుంచి రోడ్లకు మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా గుంతలు పడ్డాయని, మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్డు వేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ అప్పట్లో ఆ రోడ్డు నిర్మాణం కోసం మండల కేంద్రంలో శంకుస్థాపన చేస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే తిమ్మాపురం నుంచి శంకుస్థాపన చేశారని, దాంతో నిధులు సగానికే సరిపోయాయని తెలిపారు. బాగా గుంటలమయమైన రోడ్డును వదిలి రాజకీయ ప్రయోజనాల కోసం మరోచోట నుంచి పనులు ప్రారంభించడం సరైంది కాదన్నారు. చిల్పకుంట్ల ప్రజలకు ఎమ్మెల్యే మందుల సామేల్‌ ఎన్నికల ముందు రోడ్డు పున:నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోయారని విమర్శించారు. ఈ రెండు గ్రామాలకు వెంటనే నిధులు కేటాయించి రోడ్డు పనులు చేయించాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్రలో పాల్గొన్న ఆటో యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ.. తాము ఫైనాన్స్‌లో ఆటోలు కొని కిస్తీలు కట్టలేక ఇబ్బంది పడుతుంటే.. ఈ రోడ్డు గుంతల వల్ల ఆటోలు రిపేరుకు వచ్చి మెకానికులకే ఎక్కువ ఖర్చవుతోందన్నారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ నాగరాజు, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ కళ్యాణ్‌ వచ్చి వారితో మాట్లాడారు. రోడ్డు నిర్మాణం కోసం నిధుల అంచనా వేసి సంబంధిత అధికారులకు రెండుసార్లు నివేదిక పంపామని, త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని.. వచ్చిన వెంటనే రోడ్డు పనులు చేపడుతామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, నాయకులు పులుసు సత్యం, కందాల శంకర్‌ రెడ్డి, బొజ శ్రీను, బత్తుల జనార్ధన్‌ గౌడ్‌, చూడి మధుసూదన్‌ రెడ్డి, బత్తుల తిరుమల్‌, సామ వెంకట్‌రెడ్డి, కట్ట నర్సిరెడ్డి, గజ్జల శ్రీనివాస్‌ రెడ్డి, యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad