- Advertisement -
- – కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం బాగ్నం చేసిన పోలీసులు
– సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి పొలం రాజేందర్
నవతెలంగాణ – కాటారం : బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర బీజేపీదే అని సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు. శనివారం మహా ముత్తారం మండల కేంద్రంలోని యమనుపల్లి సెంటర్ లొ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని దిష్టి బొమ్మ నూ పోలీస్ స్టేషనకు తరలించడం జరిగింది. మేము బీసీ సంఘాల జాకు రాష్ట్ర బంద్లో లో స్వాతత్రంగా పాల్గొంటే పోలిలుసు అడ్డుకోవడం విడ్డురంగా వుంది అన్నారు. - ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినప్పుడు కేంద్రంలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేయాల్సింది కేంద్రభాద్యతే అని వారన్నారూ, ఒకవైపున కేంద్రంలో అడ్డుకుంటూ రాష్ట్రంలో మద్దతునీయడం ఈ ద్వంద వైఖరికి నిదర్శనమని అట్లాంటి సామాజిక న్యాయానికి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీని ఒంటరి చేయాలి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర బందు జరగడం వల్లనే దానికి సరైన అర్థం ఉంటుందని సూచించారు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది అని వరన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోలం చిన్న రాజేందర్ పార్టీ సభ్యులు ఆతుకూరి శ్రీధర్ మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు
- Advertisement -