నవతెలంగాణ న్యూఢిల్లీ : భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ”పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలు, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే లక్ష్యంతో భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్‌ను నిర్వహించాయి. భారత సైన్యం ప్రకారం.. ఈ దాడులు కేంద్రీకృతంగా, నిర్దేశిత లక్ష్యాలపై, తీవ్రతరం కాకుండా తొమ్మిది ప్రాంతాలలో విజయవంతంగా నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉగ్రవాదులు, వాటి నిర్వాహకులపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ చర్యలతో పాటు పహల్గాంలోని అమాయక ప్రజల ఊచకోత నిందితులను అప్పగించేలా, పాక్ భూభాగం నుండి ఎటువంటి ఉగ్రవాద సంస్థలు చర్యలు చేపట్టకుండా అడ్డుకునేలా ఆ దేశంపై ఒత్తిడి కొనసాగించాలి. భారత ప్రభుత్వం ప్రజల మధ్య ఐక్యత, దేశ సమగ్రతను కాపాడేలా చూడాలి” అని పేర్కొంది.
ఆపరేషన్ సింధూర్‌పై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ప్రకటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES