నవతెలంగాణ-హైదరాబాద్: మొత్తం 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 6న మొదటి దఫాలో 121, 11న మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. దీంతో ఈ ఎన్నికల్లో ఇండియా బ్లాక్, ఆర్జేడీ, వామపక్షాలు కలిసి బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఆయా కూటమి పార్టీలు దృష్టి పెట్టాయి. సీపీఐ(ఎం), ఆర్జేడీ కీలక సమావేశం నిర్వహించాయి. ఆర్జేడీ సీనియర్ నేత తేజిస్వీ యాదవ్‌తో CPI(M) జనరల్ సెక్రటరీ ఎంఏ బేబి, పార్టీ పొలిట్ బ్యూర్ సభ్యులు డా. అశోక్ దావాలే, విజయరాఘవన్, ఆ రాష్ట్ర CPI(M) స్టేట్ సెక్రటరీ లాలాన్ చౌదరి, పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అవధేష్ కుమార్, శాసనసభాపక్ష నాయకుడు అజయ్ కుమార్‌లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరుపార్టీలు సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చలు చేయనున్నారు. తాజా చర్చలతో ఇరుపార్టీల అభ్యర్థులు పోటీ చేసే స్థానాలపై స్పష్టత రానుంది.
సీపీఐ(ఎం), ఆర్జేడీ కీలక భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES