Monday, November 24, 2025
E-PAPER
Homeజిల్లాలుకోతుల సమస్య పరిష్కారానికి రేపు సీపీఐ(ఎం) ధర్నా

కోతుల సమస్య పరిష్కారానికి రేపు సీపీఐ(ఎం) ధర్నా

- Advertisement -

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి

నవతెలంగాణ గోవిందరావుపేట

కోతుల సమస్య పరిష్కరించాలంటూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు మండల వ్యాప్తంగా ప్రజలు కోతుల దాడిలో గాయాల పాలవుతూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కోతుల దాడిలో గాయపడి పలువురు మరణించిన సంఘటనలు కూడా మండలంలో ఉన్నాయన్నారు. కోతుల దాడిలో తప్పించుకునే ప్రయత్నంలో వాహన ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలు కూడా మండలంలో లేకపోలేదన్నారు.

ఈనాడు ఇండ్లలో కూరగాయలు పండ్ల చెట్లను లేకుండా ప్రజలు కొట్టివేస్తున్నారు అంటే దానికి కారణం కోతులు. ఇంతటి మారనకాండ సృష్టిస్తున్న కోతుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని అన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. కోతుల నుండి ప్రజలను విముక్తులు చేసేందుకు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తున్నందున మన మండలం నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -