జయప్రదం చేయండి పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ.
నవతెలంగాణ – భువనగిరి
ఆగస్టు 5 సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్లో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆగస్ట్ 5న మంగళవారం ఉదయం 10 గంటలకు తిరుందాస్ గోపి ట్రస్ట్ హాలులో శిక్షణ తరగతులలో సైదాంతిక నిర్మాణం అంశాలు బోధింస్తారన్నారు. ఈ శిక్షణ తరగతులకు పార్టీ సభ్యులు పట్టణ కమిటీ సభ్యులు సకాలంలో వచ్చి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, వనం రాజు, కల్లూరి నాగమణి, కమిటీ సభ్యులు బర్ల వెంకటేష్, వలదాస్ అంజయ్య, పాల్గొన్నారు
సీపీఐ(ఎం) పట్టణ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES