నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం కువైట్ గగనతలంలో కూలిపోయిన విషయం తెలిసిందే.కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ (కిపిక్) సోమవారం విమానం శిథిలాలు మినా అల్ అహ్మది శుద్ధి కర్మాగారంలోకి పడ్డాయని ధృవీకరించింది. విమానం కూలిపోయే ముందు పైలట్ విమానంలో నుండి బయటకు వెళ్లాడని అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. అయితే తాజాగా సదురు వార్ జెట్ ఫైలట్ ఫొటోను ఇరాన్ రక్షణ దళాలు విడుదల చేశాయి. పైలట్ స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు విడుదలయ్యాయి. విమానం మంటల్లో చిక్కుకుని పడిపోతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇరాన్ ఒకేసారి ఇజ్రాయిల్, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించడం ద్వారా తన దాడులను కొనసాగిస్తోంది.
కూలిన అమెరికా ఎఫ్-15..ఫైలట్ సురక్షితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


