Friday, March 13, 2026
E-PAPER
Homeఆటలుసన్‌రైజర్స్‌పై క్రికెట్ అభిమానులు ఫైర్..

సన్‌రైజర్స్‌పై క్రికెట్ అభిమానులు ఫైర్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కొన్ని నెల‌ల‌క్రితం బంగ్లాదేశ్‌లో తలెత్తిన రాజ‌కీయ సంక్షోభం కార‌ణంగా మైనార్టీలైన హిందువుల‌పై అకార‌ణంగా దాడులు జ‌రిగాయి. ఈ దాడుల‌తో అనేక హిందువులు మ‌ర‌ణించారు. ఈ దుర్ఘ‌ట‌ల‌ను వ్య‌తిరేకిస్తూ భార‌త్‌లో భారీగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు మిన్నంటాయి. దీంతో బంగ్లా క్రికెట్ పేస‌ర్‌ను కొనుగోలు చేసినా కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్‌ వేదికగా జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్‌ టోర్నీ ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో పాకిస్తాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంచైజీపై క్రికెట్ అభిమానులు మండిప‌డుతున్నారు. ఈక్ర‌మంలోనే సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంచైజీకి ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు అధికారిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) ఖాతా అనూహ్యంగా సస్పెన్షన్‌కు గురైంది. ఖాతా సస్పెన్షన్‌పై ఎక్స్‌ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఖాతా ఏమైందనేది తెలియరాలేదు. ఫ్యాన్స్‌ మాత్రం నిన్నటి నుంచి పాక్‌ ప్లేయర్‌ కొనుగోలు విషయంపై భారీ స్థాయిలో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఖాతాను టార్గెట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -