– గ్రీన్ సిగల్ ఇచ్చిన ఒలింపిక్ కమిటీ
టోక్యో: 2026లో జపాన్ వేదికగా జరిగే 20వ ఆసియా క్రీడల్లోనూ క్రికెట్‌కు చోటు దక్కింది. ఆర్గనైజింగ్ కమిటీతో భేటి అనంతరం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఈ విషయాన్ని వెల్లడించింది. తదుపరి ఆసియా క్రీడల్లో క్రికెట్‌తో పాటు మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడకు కూడా చోటు లభించింది. టి20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 14 పురుష జట్లు, 9 మహిళల టీమ్స్ పాల్గొంటాయి. గత ఆసియా క్రీడల్లో టీమిండియా పురుషులు, మహిళల జట్లు స్వర్ణ పతకాలను సాధించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను తొలిసారి 2010లో పరిచయం చేశారు. ఆతర్వాత కేవలం రెండు సార్లు (2014, 2022) మాత్రమే ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు అనుమతి లభించింది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంతో తదుపరి ఆసియా క్రీడల్లో కూడా క్రికెట్ నిర్వహణకు గ్రీన్ సిగల్ లభించింది. 1900 పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ఇదే మొదటిసారి. 2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి.
2026 ఆసియా క్రీడల్లోనూ క్రికెట్‌కు చోటు
- Advertisement -