– ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి
– టోర్నమెంట్ కు కన్నాయిగూడెం రిపోర్టర్స్ సిద్ధంగా ఉండాలి
– కన్నాయిగూడెం ఎస్సై ఇన్నిగాల వెంకటేష్
నవతెలంగాణ-కన్నాయిగూడెం : ములుగు జిల్లాలో మీడియా మిత్రులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి తలపెట్టినారు. అందుకోసం మండలాల వారీగా ఒక టీము ను తయారుచేసి 10 మండలాలకు గాను 10 టీములతో కూడిన టోర్నమెంట్ ను ములుగు జిల్లా కేంద్రంలో తంగేడు మైదానంలో నిర్వహించాలనీ అని అనుకున్నారు ఈ టోర్నమెంట్ లో భాగంగా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి ఆదేశాల మేరకు ఎస్ ఐ ఇనిగాల వెంకటేష్ మాట్లాడుతూ కన్నాయిగూడెం మండలానికి సంబంధించిన మీడియా ప్రతినిధులు ఎంతమంది ఉన్నారో వారు తమ తమ టీమ్ లను మాకు తెలియచేయగలరు అని కోరారు . అట్టి టీముల మధ్య పోటీ నిర్వహించి గెలిచిన జట్టును కన్నాయి గూడెం మండల టీముగా పరిగణించడం జరుగుతుంది. మండలంలో ఆడిన తర్వాత జిల్లాలో ఎస్పి డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ ఆడాల్సి ఉంటుందని ఈ సందర్భంగామీడియా మిత్రులకు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మండలములో వర్కింగ్ జర్నలిస్టులు అందరూ పాల్గొనడం జరిగింది
మీడియా మిత్రులకు క్రికెట్ టోర్నమెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



